రక్షణ కల్పించండి..! అమిత్‌షాకు బాబు ఫోన్
1 min readపల్లెవెలుగువెబ్, అమరావతి: వైసీపీ చేస్తోన్న దాడుల నుంచి రక్షణ క్పలించాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు మంగళవారం కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు, ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్‌కు ఫోన్ ద్వారా కోరారు. ఈమేరకు వైసీపీ వైఖరిపై ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు నక్కా ఆనంద్‌బాబు, కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌లు అటు ప్రభుత్వంపై, ఇటు ఏపీ సీఎం జగన్‌పై చేసిన తీవ్రస్థాయి ఆరోపణలను నిరసిస్తూ వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తెదేపా కార్యాలయాలపై వైసీపీ కార్యకర్తలు మూకుమ్మడి దాడులకు పాల్పడడంతోపాటు టీడీపీ నేతల ఇళ్ల వద్ద బఠాయింపులు, ఆందోళనలు చేపడుతున్నారు. కేంద్ర బలగాలచే భద్రత కల్పించాలంటూ చంద్రబాబు హోంశాఖను కోరారు.