ఇక నుంచి పిల్లలు తప్పు చేస్తే.. శిక్ష వారికే !
1 min readపల్లెవెలుగు వెబ్ : చైనా మరో కొత్త చట్టం చేసింది. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులకు శిక్ష విధించడం ఆ చట్టం సారాంశం. ఫ్యామిలీ ఎడ్యుకేషన్ ప్రమోషన్ లా పేరుతో ఇప్పటికే ముసాయిదా బిల్లు రూపొందించింది. దీని ప్రకారం పిల్లలు ప్రవర్తన సరిగా లేకపోయినా.. వారు నేరాలకు పాల్పడినా ముందుగా తల్లిదండ్రులకు సమాచారం ఇస్తారు. తర్వాతి పిల్లల్లో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. అప్పటికీ పిల్లలు మారకపోతే తల్లిదండ్రులు పనిచేసే సంస్థలకు, యజమానులు సమాచారం ఇస్తారు. తర్వాత తల్లిదండ్రులకు శిక్షణ ఇస్తారు. ఆ కార్యక్రమానికి వారు తప్పకుండా హాజరుకావాలి. లేదంటే వారికి 11,600 జరిమానా, జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది.