‘రైల్వే కోచ్, నాగలదిన్నె బ్రిడ్జి’పై గద్వాల కలెక్టర్‌ను కలిసిన ఎంపీ
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: కర్నూలు జిల్లా పంచలింగాలలో ఉన్న రైల్వే కోచ్ రిహాబిలిటేషన్ వర్క్ పనులు త్వరగా పూర్తి చేసేందుకు సహకరించాలని గద్వాల కలెక్టర్ వల్లూరు క్రాంతిని కోరారు కర్నూలు ఎంపీ డా. సంజీవ్ కుమార్. గురువారం గద్వాల కలెక్టర్‌ను ఎంపీ కలిశారు. రైల్వే కోచ్ రిహాబిలిటేషన్ వర్క్‌కు తెలంగాణ ప్రభుత్వం 7.5 ఎకరాలు రైల్వే శాఖకు ఇవ్వాల్సి ఉందని, అదేవిధంగా నాగలదిన్నె బ్రిడ్జికు సంబంధించి ఇవ్వాల్సిన భూమి విషయంపై ఎంపీ డా. సంజీవ్ కుమార్ ఈ సందర్భంగా చర్చించారు.
ఇందుకు గద్వాల కలెక్టరు వల్లూరు క్రాంతి సానుకూలంగా స్పందించారు. రెండు ప్రాజెక్టులకు సంబంధించి త్వరగా పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చినట్లు కర్నూలు ఎంపీ డ. సంజీవ్ కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.