వైసీపీ దాడులపై బాబు 36గంటల నిరసన దీక్ష!
1 min readపల్లెవెలుగువెబ్, అమరావతి: టీడీపీ కార్యాలయాలు, పార్టీ నేతల ఇళ్లపై వైసీపీ చేసిన మూకుమ్మడి దాడులకు నిరసనగా మంగళగిరి తెదేపా కార్యాలయం వద్ద టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు 36గంటల నిరసన దీక్షను గురువారం ఉదయం నుంచి ప్రారంభించారు. దాడి జరిగిన తెదేపా కార్యాలయం వద్దే చంద్రబాబు దీక్షబూనారు. పోలీసులకు చేతకాకపోతే ఇంటికి వెళ్లి పోవాలని ఆయన చెప్పారు. తమ పార్టీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడుల వెనుక పెద్ద కుట్ర జరిగిందని ఆయన ఆరోపించారు.తన రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటనలు చూడలేదన్నారు. టీడీపీని తుదముట్టంచేందుకు వైసీపీ కుట్ర పన్నిందన్నారు. పట్టాభి ఇంటిపై దాడి చేసిన నిందితులను అరెస్ట్ చేయకపోగా పట్టాభినే అరెస్ట్ చేయడంపై ఆయన మండిపడ్డారు. టీడీపీ కార్యాలయానికి సీఐ అధికారి ఎందుకు వచ్చారు.. మా అనుమతి లేకుండా ఆయన రావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందన్నారు. మీ ఇంటికి అనుమతి లేకుండా వస్తే అనుమతిస్తారా అని ఆయన ప్రశ్నించారు. పైగా తమ పార్టీకి చెందిన నేతలపైనే 302 సెక్షన్ల కింద కేసు పెట్టారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నిరసన దీక్ష శుక్రవారం సాయంత్రం దాకా కొనసాగుతుంది.
రేపు ఢిల్లీకి..చంద్రబాబు..
రాష్ట్రంలో చోటుచేసుకున్న ఆందోళనకర పరిణామాల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిసేందుకు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈమేరకు వైసీపీ దాడులపై కేంద్రానికి లిఖితప్వూకంగా ఫిర్యాదు చేయడంతోపాటు ఏపీలోని తాజా పరిస్థితులను వివరించనున్నారు. 36గంటల నిరసన దీక్ష అనంతరం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది.