PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సకలవేదనలకు ‘గీత’ దివ్యౌషధం

1 min read

-దివి హయగ్రీవాచార్యులు
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: భగవధ్గీత సకల వేదనలకు దివ్యౌషధమన్నారు ప్రముఖ ధార్మిక ప్రవచకులు , ప్రముఖ వ్యాఖ్యాత డాక్టర్ దివి హయగ్రీవాచార్యులు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ కాలనీ లోని శ్రీ క్రిష్ణ మందిరం నందు మంగళవారం నుండి జరుగుతున్న ధార్మిక ప్రవచనాలలో భాగంగా గురువారం వారు భగవద్గీతపై ప్రవచించారు. జీవితం సుఖదుఃఖాల సమాహారమని, కష్టాలు కలిగినపుడు కృంగి పోవడం, సుఖాలు కలిగినపుడు పొంగిపోవడం సామాన్య మానవుడి సహజగుణమనీ, కష్టాలకు కృంగక, సంతోషాలకు పొంగక అన్నింటినీ సమమైన మనస్సుతో ఎదుర్కొనే శక్తి గీత నేర్పిస్తుందని అన్నారు.
ఉపన్యాసానికి ముందు వై.బాలనాగిరెడ్డి బృందం చేసిన భజన కార్యక్రమం భక్తులను ఎంతగానో అలరించింది.


ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, శ్రీ క్రిష్ణ మందిరం గౌరవాధ్యక్షులు సత్యనారాయణ , అధ్యక్షులు పార్థసారథి కృష్ణ ,ఉపాధ్యక్షులు విజయచంద్రుడు, ట్రెజరర్ జె.వేంకటేశ్వర్లు , కృష్ణమందిరం సెక్రటరీ మరియు కౌన్సిలర్ శివ శంకర్ యాదవ్, సరస్వతి విద్యా పీఠం కార్యదర్శి పరంధామ రెడ్డి , భజన బృందం అధ్యక్షుడు వై. బాలనాగిరెడ్డి , నంద్యాల ధర్మ ప్రచారకులు యం. కృష్ణ ప్రతాప్ , గీతా ప్రచారకులు యం.మద్దయ్య స్వామి, రాధా లక్ష్మి , రమణయ్య రోటరీ స్కూల్ కరస్పాండెంట్ సుబ్బయ్య యాదవ్ , గోపాల్ యాదవ్, ఓబులేసు యాదవ్ , గోపాలకుడు పూర్ణచంద్రరావు , శ్రీకృష్ణ భగవాన్ సేవా సమితి కమిటీసభ్యులు, శ్రీ వారి సేవకులు సూర్య నారాయణ,పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

About Author