PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అనుచిత వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి: మేయర్ నూర్జహాన్

1 min read

పల్లెవెలుగు వెబ్​, ఏలూరు: ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ… ఆదరాభిమానాలు పొందిన సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నాయకులు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు.. ఉప ముఖ్యమంత్రి ఆళ్ళనాని ఆదేశాల మేరకు గురువారం ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జనాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మేయర్ నూర్జహాన్ పెదబాబు మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ పార్టీ అధికార ప్రతినిధి పట్టాబితో అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారని ఆరోపించారు.

About Author