టీడీపీ నాయకులు క్షమాపణ చెప్పాల్సిందే…
1 min read– వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి తెర్నేకల్ సురేందర్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నాయకులు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి తెర్నేకల్ సురేందర్ రెడ్డి, కర్నూలు నగర అధ్యక్షుడు రాజా విష్ణువర్ధన్ రెడ్డి . శుక్రవారం రాత్రి కలెక్టరేట్ ముందు ఉన్న గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా వైసీపీ నగర అధ్యక్షుడు రాజా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమార్థం.. సుభిక్ష పాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోట్లాది ప్రజల ఆదరణ పొందారని, ఇది ఓర్వలేని టీడీపీ నాయకులు కుట్ర పూరితంగా మాటల బాంబులు పేల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర బి.సి. సెల్ కార్యదర్శి రియల్ టైం నాగరాజు యాదవ్, వైసీపీ సేవాదల్ నగర అధ్యక్షులు మల్లికార్జున, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ రాఘవేంద్ర రెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి మున్నా, కర్నూల్ పార్లమెంట్ సోషల్ మీడియా అధ్యక్షులు ఇంద్రసేన రెడ్డి, శ్రీధర్ రెడ్డి, 49 వ వార్డు కార్పొరేటర్ కృష్ణకాంత్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి,భాస్కర్ రెడ్డి, మార్కెట్ యార్డు డైరెక్టర్ మధు సుధన్ రెడ్డి, దామోదర్,ప్రేమ్,శ్రీను వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.