జగన్ నిర్దోషిగా రావాలి… సుప్రీంలో ఆర్ఆర్ఆర్ పిటిషన్ !
1 min readపల్లెవెలుగు వెబ్ : ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ పై సుప్రీం కోర్టులో పిటిషన్ వేసినట్టు నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. కేసుల విచారణ వేగవంతం చేయాలని పిటిషన్ దాఖలు చేసినట్టు తెలిపారు. ఏడాదిలోగా క్రిమినల్ కేసులు విచారించాలని గతంలో సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చిందని అందులో పేర్కొన్నారు. జగన్ నిర్దోషిగా రావాలని పిటిషన్ దాఖలు చేసినట్టు రఘరామకృష్ణరాజు తెలిపారు.