మహానందిలో తాగునీటి సరఫరాకు చర్యలు..
1 min read– పైపులైన్ ఏర్పాటు…మట్టికట్ట తొలగింపు..
పల్లెవెలుగు వెబ్, మహానంది: కర్నూలు జిల్లా మహానంది గ్రామపంచాయతీలో గత కొన్ని నెలల నుంచి దుర్వాసన వెదజల్లుతున్న నీరు … తాగునీరుగా సరఫరా అవుతోంది. ఆ నీటిని తాగిన గ్రామస్తులు వాంతులు, విరేచనాలకు గురయ్యారు. దీనికితోడు మురుగునీరు రోడ్లపై నిల్వ ఉండటంతో దోమలు వృద్ధి చెంది.. పిల్లలు, వృద్ధులు, మహిళలు డెంగ్యూ, మలేరియా బారిన పడ్డారు. ప్రజలురోగాల బారిన పడినా.. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. శనివారం ఉదయం ‘ పల్లెవెలుగు వెబ్ మీడియా’లో ‘‘మహానందిలో దుర్వాసన నీరే..తాగునీరు” శీర్షికన కథనం ప్రచురితమైంది.
ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆర్డబ్ల్యూ ఎస్ అధికారులు రాత్రి 7 గంటలకు యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టారు. పైపులైన్ ఏర్పాటుతో పాటు రోడ్డుక అడ్డంగా వేసిన మట్టికట్టను తొలగించారు. ఎంపీడీఓ సుబ్బరాజు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నాయక్తిమ్మాపురం,, పంచాయతీ కార్యదర్శి నాగ సంజీవ రావు దగ్గరుండి పనులు పర్యవేక్షించారు.