సీఐ, ఎస్ఐ సస్పెండ్
1 min readపల్లెవెలుగు వెబ్: భూ వివాదాలకు సంబంధించిన అవినీతి ఆరోపణలు రావడంతో హైదరాబాద్ లోని సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలోని నార్సింగి పోలీస్ స్టేషన్ సీఐ, ఎస్ఐ లను సీపీ స్టీఫెన్ రవీంద్ర సస్పెండ్ చేశారు. సీఐ గంగాధర్, ఎస్ఐ లక్ష్మణ్ లను సస్పెండ్ చేస్తూ కమీషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కొంతకాలంగా ఎస్ఐ, సీఐలు ఇద్దరు భూవివాదాల్లో తలదూర్చినట్టు తెలుస్తోంది. వీటితో పాటు అవినీతి ఆరోపణలు రావడంతో సీపీ వారిపై చర్యలు తీసుకొన్నారు. ఈ వ్యవహారంపై అంతర్గత విచారణకు సీపీ స్టీఫెన్ రవీంద్ర ఆదేశించినట్టు తెలుస్తోంది.