ఆంధ్రాలో పార్టీ పెట్టమంటున్నారు : కేసీఆర్
1 min readపల్లెవెలుగు వెబ్: హైదరాబాద్ లో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీలో సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దళితబంధు ప్రకటించాక.. ఆంధ్రా నుంచి వేల వినతులు వస్తున్నాయని, ఆంధ్రాలో పార్టీ పెడితే గెలిపించుకుంటామని అక్కడ ప్రజలు అంటున్నారని తెలిపారు. తెలంగాణ పథకాలు తమకు కావాలని ఆంధ్రా ప్రజలు కోరుతున్నారని చెప్పారు. తమ ప్రాంతాలను తెలంగాణలో కలపాలని పొరుగు రాష్ట్రాల నుంచి డిమాండ్లు వస్తున్నాయని తెలిపారు. నాందేడ్, రాయచూర్ జిల్లాల నుంచి ఈ డిమాండ్లు ఉన్నాయని చెప్పారు. తెలంగాణ పథకాలు చూసి ఇతర రాష్ట్రాల సీఎంలు ఆశ్చర్యపోతున్నారని అన్నారు.