NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క‌ట్నం తీసుకుంటున్నారా ? అయితే.. ప్రభుత్వానికి లెక్కలు చెప్పాల్సిందే !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఉత్తర‌ప్రదేశ్ ప్రభుత్వం సంచ‌ల‌న నిర్ణయం తీసుకుంది. 2004 త‌ర్వాత పెళ్లి చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు వ‌ర‌క‌ట్నం తీసుకున్న వివ‌రాలు ప్రభుత్వానికి స‌మ‌ర్పించాల‌ని ఉత్తర్వులు జారీ చేసింది. లేనిప‌క్షంలో శాఖాప‌రమైన చ‌ర్యలు తీసుకుంటామ‌ని హెచ్చరించింది. వివిధ శాఖ‌ల్లో పనిచేస్తున్న సుమారు 10వేల మంది ఉద్యోగులు వర‌క‌ట్న వివ‌రాలు స‌మ‌ర్పించాల్సి ఉంది. ఇప్పటికే అన్ని జిల్లాల్లో ప‌నిచేస్తున్న ఉద్యోగుల‌కు మ‌హిళా శిశుసంక్షేమ శాఖ డైరెక్టర్ పేరిట నోటీసులు అందాయి. ఏ ఏడాదిలో వివాహం జ‌రిగింది ?. ఎంత క‌ట్నం తీసుకున్నారు?. ఎలాంటి ప‌రిస్థితుల్లో క‌ట్నం తీసుకోవాల్సి వ‌చ్చింది ? వ‌ంటి ప్రశ్నల‌కు స‌మాధానం ఇవ్వాల్సిందిగా కోరింది.

About Author