17 రోజులు బ్యాంకులకు సెలవులు !
1 min readపల్లెవెలుగు వెబ్ : నవంబర్ లో బ్యాంకులకు 17 రోజులు వరుస సెలవులు రానున్నాయి. ఆర్బీఐ ప్రకటించిన సెలవుల జాబితా ప్రకారం పండుగలు, సాధారణ సెలవులు కలిపి మొత్తం 17 రోజులు బ్యాంకులు పనిచేయవు. ఏపీలో మాత్రం కేవలం 8 రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేయవు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఒక్కో విధంగా సెలవులు మంజూరు చేస్తారు. మొత్తం 17 రోజులు సెలవులు అన్ని రాష్ట్రాలకు ఒకేవిధంగా వర్తించవు. దీపావళి, గురునానక్ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు.