‘హార్టికల్చర్’ అభివృద్ధికి కృషి: జేసీ
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: కర్నూలు జిల్లాలో హార్టికల్చర్ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు జాయింట్ కలెక్టర్ (డెవలప్మెంట్) మనజీర్ జిలాని సమూన్. మంగళవారం కర్నూలు జిల్లా తుగ్గలి మండలం గిరిగేట్ల గ్రామంలో రైతులు సాగు చేసిన జామ, మామిడి, స్వీట్ ఆరంజ్, డ్రాగన్ ఫ్రూట్స్ తదితర మొక్కలను జేసీతో పాటు డ్వామా పీడీ అమర్నాథ్ రెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగా జేసీ జిలానీ సమూన్ మాట్లాడుతూ.. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించే అవకాశం.. పండ్లు, పూలమొక్కల పెంపకంతో సాధ్యమన్నారు. మొక్కలకు ఎప్పటికప్పుడు వాటర్ సరఫరా చేయడంతోపాటు వాటిని సంరక్షించుకోవాలన్నారు. అనంతరం డ్వామా పీడీ అమర్నాథ్ రెడ్డి రైతులకు తగు సలహాలు, సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో తుగ్గలి మండలం ఎంపీడీఓ, ఎమ్మార్వో, ఏపీడీ, అంబుడ్స్మెన్, ఈజీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.