PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దివ్యాంగ విద్యార్థులకు ఉపకార వేతనం..

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: ప్రస్తుత విద్యా సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం అందించే ఉపకార వేతనాలకు దివ్యాంగ విద్యార్థులు ( ఫ్రెష్ , రెన్యూవల్ ) దరఖాస్తు చేసుకోవాలని విభిన్నప్రతిభావంతుల హిజ్రాల, వయోవృద్దుల సంక్షేమ శాఖ జిల్లా మేనేజర్, అసిస్టెంట్ డైరెక్టర్ పి. విజయ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రీ మెట్రిక్ విద్యార్థులు ( 9 , 10 తరగతులు ) నవంబరు 15 లోగా, పోస్ట్ మెట్రిక్ ( ఇంటర్ , డిగ్రీ లేదా డిప్లొమా ) , టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ ( గ్రాడ్యు యేట్ , పోస్ట్ గ్రాడ్యుయేట్ ) విద్యార్థులు నవంబరు 30 లోగా https : // scholarships . gov . in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె ఆ ప్రకటనలో సూచించారు.

About Author