PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భాగ్యరేఖ సేవలు.. మరువలేనివి

1 min read
ఐసీడీఎస్​ పీడీ భాగ్యరేఖను సన్మానిస్తున్న అధికారులు

ఐసీడీఎస్​ పీడీ భాగ్యరేఖను సన్మానిస్తున్న అధికారులు

  • జేసీలు రాంసుందర్​ రెడ్డి, సయ్యద్​ ఖాజా మొహిద్దీన్​
    – బదిలీపై వెళ్లనున్న ఐసీడీఎస్​ పీడీకి ఘనసన్మానం
    పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: జిల్లాలో ఐసిడిఎస్ పిడి భాగ్యరేఖ అందించిన సేవలు మరువలేనివని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు అభివృద్ధి) రామ సుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) సయ్యద్ ఖాజా మోహిద్దీన్ కొనియాడారు. సోమవారం రాత్రి కలెక్టరేట్లోని పశుసంవర్ధక శాఖ గోకులం సమావేశ భవనంలో కర్నూలు జిల్లాలో ఐసిడిఎస్ పీడీగా విధులు నిర్వహించిన భాగ్యరేఖకు జిల్లా అధికారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు అభివృద్ధి) రామ సుందర్ రెడ్డి మాట్లాడుతూ ఐసిడిఎస్ పిడి భాగ్యరేఖ చాలా చక్కగా తమకు అప్పజెప్పిన విధులను నిర్వర్తించారన్నారు. కోవిడ్ విపత్కర పరిస్థితులలో కోవిడ్ కేర్ సెంటర్ లో నోడల్ ఆఫీసర్ గా ఉంటూ కరోనా బాధితులకు మంచి సేవలు అందించారన్నారు. ఐసిడిఎస్ పీడీ భాగ్యరేఖ ఇటీవల జరిగిన బదిలీల్లో అసిస్టెంట్ సెక్రటరీ సీసీఎల్ఏ కార్యాలయం విజయవాడకు బదిలీ కావడం చాలా మంచి విషయమని, ఆనందంగా కలదన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) సయ్యద్ ఖాజా మోహిద్దీన్ మాట్లాడుతూ జిల్లాలో అధికారులు అందరూ ఒక టీమ్ గా చక్కటి సమన్వయంతో పని చేస్తున్నారన్నారు. ఐసిడిఎస్ పిడి భాగ్యరేఖ వృత్తిని దైవంగా భావించి జిల్లాలో మంచి సేవలు అందించారన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ జిల్లా అధికారుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు రామస్వామి మాట్లాడుతూ జిల్లాలో ఐసిడిఎస్ పీడీ భాగ్యరేఖ మంచి సేవలు అందించారని కొనియాడారు. అదేవిధంగా బదిలీపై వెళుతున్న ఐసిడిఎస్ పీడీ భాగ్య రేఖ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు అభివృద్ధి) రామ సుందర రెడ్డి ల సారథ్యంలో సమర్థవంతమైన నాయకత్వంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. అలాగే జిల్లాలోని సిడిపిఓలు, ఏడు వేల మంది అంగన్వాడీ కార్యకర్తలు తనకు బాగా తోడ్పాటు నుంచి మంచి సేవలు అందించారన్నారు.
    భాగ్యరేఖ సేవలపై… ప్రశంసలు
    అలాగే రిటైర్డ్ డి ఆర్ ఓ సుబ్బారెడ్డి, డిఆర్ఓ పుల్లయ్య, సమాచార ఉపసంచాలకులు పి.తిమ్మప్ప, డిఆర్డిఏ పిడి శ్రీనివాసులు, మార్కెటింగ్ ఎడి సత్యనారాయణ చౌదరి, సోషల్ వెల్ఫేర్ డిడి రమాదేవి, సిరికల్చర్ ఏడి వాణి, మైనార్టీ కార్పొరేషన్ ఈడి పర్వీన్ భాను, ఎన్ ఐ సి డిడి అనురాధ తదితర జిల్లా అధికారులు ఐసిడిఎస్ పిడి భాగ్యరేఖ సేవలపై కొనియాడుతూ ప్రసంగించారు. సన్మాన కార్యక్రమం లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లు మల్లికార్జున్, శ్రీనివాసులు, జెడ్పి సీఈఓ వెంకటసుబ్బయ్య, పశుసంవర్ధక శాఖ జెడి డాక్టర్ రమణయ్య, డ్వామా పిడి అమరనాథ రెడ్డి, డి ఎం హెచ్ ఓ డాక్టర్ రామ గిడ్డయ్య, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సోమశేఖర్ రెడ్డి, బీసీ కార్పొరేషన్ ఈడీ శిరీష, జిల్లా ఉపాధి కల్పనాధికారి రామ, జిల్లా అధికారులు, జిల్లా అధికారుల సంక్షేమ సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

About Author