అప్పుల ఊబిలో పాక్.. సౌదీ భారీ సాయం !
1 min readపల్లెవెలుగు వెబ్: అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్థాన్ కు సౌదీ అరేబియా భారీ సాయం ప్రకటించింది. 4.2 బిలియన్ డాలర్లు అందించేందుకు సౌదీ అంగీకరించింది. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ తో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జరిపిన చర్చల అనంతరం ఈ ప్రకటన వెలువడింది. పాకిస్థాన్ కేంద్ర బ్యాంకులో 3 బిలియన్ డాలర్లు సౌదీ జమచేయనుంది. 1.2 బిలియన్ డాలర్లు ఈ ఏడాది రిఫైన్ పెట్రోలియం ఉత్పత్తులకు ఫైనాన్స్ చేయనుంది. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాక్ కు సౌదీ సహాయం ఎంతో ఊరటనిస్తుంది. సౌదీ సహాయం పట్ల పాక్ ప్రధాని ఇమ్రాన్ కృతజ్ఞతలు తెలిపారు. సౌదీ సహాయంతో పాక్ రూపాయి కోలుకుంటుందని ఇమ్రాన్ సలహాదారు శౌకత్ తరిణ్ తెలిపారు.