నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్.. దళిత పక్షపాతి
1 min readపల్లెవెలుగు వెబ్, నందికొట్కూరు: నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి దళిత పక్షపాతి అన్నారు వైస్ చైర్మన్ అర్షపోగు ప్రశాంతి. దళితులతో సన్నిహితంగా ఉండే చైర్మన్ సుధాకర్ రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేశారని ఆరోపించారు. కొందరు మద్యం తాగి తన ఇంటిపై దాడి చేసి భయభ్రాంతులకు గురి చేశారని, వారిపై కేసు నమోదు చేయడానికి వెళ్లిన మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డిపై అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసు బనాయించడం దారుణమన్నారు. దీన్ని ఖండిస్తూ గురువారం మున్సిపల్ వైస్ చైర్మన్ అర్షపోగు ప్రశాంతి నేతృత్వంలో కౌన్సిలర్లు, అభిమానులు మున్సిపల్ కార్యాలయం నుంచి పటేల్ సెంటర్కు చేరుకుని నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా అర్షపోగు ప్రశాంతి మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ ప్రజల ఆదరాభిమానాలు పొందారని, ఆయన ఎదుగుదలను ఓర్వలేక టీడీపీ నాయకులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సీఐకి అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ లు కె.చిన్నరాజు, అబ్దుల్ హమీద్ మియ్య, నాయబ్, రవూఫ్, లాలు ప్రసాద్,చెరుకు సురేష్, మంగళి కృష్ణ, రాధిక, బోయ జయమ్మ, రేష్మ, SC సెల్ – బొల్లెద్దుల రామక్రిష్ణ, వార్డు ఇంచార్జ్ ఉస్మాన్ బేగ్, ముస్లిం మైనారిటీ తాలుకా అధ్యక్షులు అబుబక్కర్, వైసిపి నాయకులు చింత శ్రీను, డి.రమేష్, రవింద్రా రెడ్డి, అబ్దుల్లా, శాలి భాష, పి.రమేష్, శేఖర్, చింత విజ్జి, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.