లక్ష్మీపురంలో పర్యటించిన ఎమ్యెల్యే, మేయర్,కమీషనర్
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలోని పాణ్యం నియోజకవర్గ కల్లూరు అర్బన్ 28వ వార్డ్ లక్ష్మీపురంలో శుక్రవారం ఎమ్యెల్యే మరియు టీటీడీ పాలక మండలి సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి , కర్నూలు నగర మేయర్ బి.వై.రామయ్య , నగర పాలక కమిషనర్ డీకే.బాలాజీ పర్యటించారు. ఈ సందర్భంగా డ్రైనేజీ ద్వారా మురుగు నదిలో కలుస్తుండటంతో.. హంద్రీనీవా నది కలుషితం అవుతోందని, ఇక్కడ పెద్ద కాలువ , నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రజలు కోరారు.
అదేవిధంగా వార్డులోని ఎస్సీ కాలనీ లో మోడరన్ టాయిలెట్స్ నిర్మించాలని విన్నవించగా.. వార్డులోని సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, మేయర్ బీవై రామయ్య హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ నారాయణ రెడ్డి, నగర పాలక డిఈ రాధాకృష్ణ, ఏఈ కృష్ణలత, మాజీ సర్పంచ్ లు సత్యం రెడ్డి, బాబు,సుబ్రహ్మణ్యంశెట్టి,కల్లూరు సింగిల్ విండో ప్రెసిడెంట్ శివశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.