చార్టెడ్ అకౌంటెంట్ రంగానికి మంచి డిమాండ్: ఎంపీ టీజీ వెంకటేష్
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్లోని స్కంద బిజినెస్ హబ్లో చార్టెడ్ అకౌంటెంట్ కార్యాలయాన్ని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ప్రారంభించారు. ప్రస్తుతం చార్టెడ్ అకౌంటెంట్ రంగానికి మంచి డిమాండ్ ఉందన్నారు. నగరంలో వ్యాపార లావాదేవీలు పెరగడంతో…చార్టెడ్ అకౌంటెంట్లకు ఆదరణ లభిస్తోందని టీజీ చెప్పుకొచ్చారు. అనంతరంచార్టెడ్ అకౌంటెంట్ బాలకృష్ణ మాట్లాడుతూ… తమ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తమ కార్యాలయాన్ని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ బాలరాజు, శేషగిరి శెట్టి, బిజెపి నేత హరీష్ బాబు తదితరులు పాల్గొన్నారు.