బద్వేల్ ఉపఎన్నికల పోలింగ్ నేడే !
1 min readపల్లెవెలుగు వెబ్: కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో ఉపఎన్నిక పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తీ చేశారు. ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి విజయానంద్ కోరారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కొనసాగనుంది. ఉప ఎన్నికను స్వేచ్చగా, న్యాయబద్ధంగా ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తీ చేశామన్నారు. మొత్తం పోలింగ్ ప్రక్రియను వీడియో రికార్డింగ్ తో పాటు వెబ్ క్యాస్టింగ్ కూడ చేయనున్నట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతం బద్వేలు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో 2,15,292 ఓట్లు ఉన్నాయి. అందులో పురుషులు 1,07,915 మంది, మహిళలు 1,07,355 మంది ఉన్నారు. ట్రాన్స్జెండర్లు 22 మంది ఉన్నారు. వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ సుధ, బీజేపీ అభ్యర్థిగా పనతల సురేష్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి కమలమ్మ పోటీలో ఉండగా.. టీడీపీ ఎన్నికకు దూరంగా ఉంది.