వర్క్ ఫ్రం స్పేస్ !
1 min readపల్లెవెలుగు వెబ్ : వర్క్ ఫ్రం హోం కాన్సెప్ట్ కరోనాకి ముందు కొత్తగా, వింతగా అనిపించేది. కరోన తర్వాత అది కామన్ అయిపోయింది. ఐటీ ఉద్యోగులు పెద్ద ఎత్తున వర్క్ ఫ్రం హోం కి అలవాటు పడిపోయారు. కరోన వైరస్ ప్రభావం కొంత మేర తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో వర్క ఫ్రం హోం నుంచి ఉద్యోగులు వర్క్ ఫ్రం ఆఫీస్ కు షిఫ్ట్ అవుతున్నారు. అయితే.. వీటికి భిన్నంగా వర్క్ ఫ్రం స్పేస్ ను త్వరలో ప్రారంభించనున్నారు అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్. తన మానస పుత్రికైన బ్లూ ఆరిజన్ సంస్థ మరికొన్ని సంస్థలతో కలిసి ఆర్బిటాల్ రీఫ్
పేరుతో కమర్షియల్ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో పది మంది దాక పని చేసే వెసులు బాటు ఉంటుంది. ఇందులో హోటల్, సినిమా స్టూడియో, పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.