బంగాళఖాతంలో అల్పపీడనం.. నేడు, రేపు వర్షాలు
1 min readపల్లెవెలుగు వెబ్: బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. బంగాళఖాతంలోని అల్పపీడనం నుంచి ఉత్తరాంధ్ర తీరం వరకు 1500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది. అల్పపీడనం వద్ద 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు గాలులతో ఉపరితల ఆవర్తనం ఉంది. వీటి ప్రభావంతో శని, ఆదివారాల్లో తెలంగాణలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.