‘ ఆస్పరి’ని కరువు మండలంగా ప్రకటించడంపై హర్షం : సీపీఐ
1 min readపల్లెవెలుగు వెబ్, ఆస్పరి: కర్నూలు జిల్లా ఆస్పరి మండలాన్ని కరువు మండలంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం సంతోషించదగ్గ విషయమన్నారు సీపీఐ మండల కార్యదర్శి విరుపాక్షి, పట్టణ కార్యదర్శి కృష్ణమూర్తి. శనివారం ఆస్పరి సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సిపిఐ పోరాటాల ఫలితంగానే ఆస్పరి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించారన్నారు. ఈ సంవత్సరం రైతులు వేసిన సాగు చేసిన పత్తి, వేరుశెనగ, ఆముదము, కందులు సజ్జలు తదితర పంటలు అన్ని తీవ్రంగా దెబ్బతిన్నాయని, కనీసం పెట్టుబడులు కూడా రైతులకు రాలేదని ఆందోళన వ్యక్తం చేస్తూ… సీపీఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపామని గుర్తు చేశారు. ఎకరాకు రూ.25వేలు పంట నష్టపరిహారం ఇవ్వాలని , అదేవిధంగా మండలంలో నెలకొన్న సమస్యలన్నీ పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ తాలూకా కార్యదర్శి మునుస్వామి నాయకులు సిపిఐ నాయకులు సంజయ్ రామాంజి ని, భీమ లింగడు, సురేష్, వీరేశ్, సుభాన్, ఏఐవైఎఫ్ నాయకులు ఇస్మాయిల్,సోమేశ్ తదితరులు పాల్గొన్నారు.