నవంబరు 1న.. ‘స్పందన’ రద్దు : కలెక్టర్ పి. కోటేశ్వరరావు
1 min read
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్పందన కార్యక్రమం సోమవారం రద్దు చేసినట్లు కలెక్టర్ పి. కోటేశ్వరరావు తెలిపారు. నవంబరు 1న ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించే స్పందన కార్యక్రమం రద్దు చేశామని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టరు పి. కోటేశ్వరరావు శనివారం ఓ ప్రకటనలో కోరారు.