నల్లబారిన నది… వేలాది చేపలు మృతి !
1 min readపల్లెవెలుగు వెబ్:అరుణాచల్ ప్రదేశ్ లోని తూర్పు కమెంగ్ జిల్లాలోని కమెంగ్ నది ఒక్కసారిగ నల్లబడింది. జిల్లా కేంద్రమైన సెప్పా వద్ద నదిలో చూస్తుండగానే వేలాది చేపలు చనిపోయాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నదిలో అన్ని రకాల లవణాల శాతం భారీ స్థాయికి చేరుకోవడంతో ఘటన జరిగినట్టు స్థానిక మత్స్యశాఖ అధికారులు తెలిపారు. ఈ రకమైన నీటిలో జలచరాలకు ఏమీ కనిపించదని, పైగా ఆక్సిజన్ పీల్చేందుకు ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. చేపల మృతికి ఇదే కారణమై ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. నదిలో టీడీఎస్ మోతాదు పెరుగుదలకు చైనానే కారణమని సెప్పా ప్రజలు ఆరోపిస్తున్నారు. అక్కడి నిర్మాణరంగ కార్యకలాపాల వల్లే నదిలో నీరు నల్లగా మారిందని అంటున్నారు. ఈ వ్యవహారంలో వాస్తవాలు వెలికి తీసేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని తూర్పు సెప్పా ఎమ్మెల్యే తపుక్ టాక్ ప్రభుత్వాన్ని కోరారు.