లైవ్ లో ఏడ్చేసిన యాంకర్ !
1 min readపల్లెవెలుగు వెబ్: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం యావత్ కర్ణాటకను శోకసంద్రంలో ముంచింది. చిన్న వయసులోనే పునీత్ మరణించడం ఆయన అభిమానుల్ని తీవ్ర వేదనకు గురిచేస్తోంది. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేని స్థితిలో ఎందరో ఉన్నారు. పునీత్ మరణ వార్తను చదువుతున్న ఓ యాంకర్ లైవ్ లోనే ఏడ్చేశారు. వార్తను చదివి బోరున ఏడ్చేశారు. కన్నడ ఛానల్ కు చెందిన ఓ యాంకర్.. పునీత్ మరణ వార్త చదివి కన్నీటి పర్యంతమయ్యారు. కొద్ది సేపటి వరకు అలా ఏడుస్తూ ఉండిపోయారు. తర్వాత న్యూస్ చానల్ సిబ్బంది వచ్చి ఆమెను ఓదార్చడంతో తర్వాత న్యూస్ రీడింగ్ కంటిన్యూ చేసింది. ఇదంతా టీవీలో టెలీకాస్ట్ అయింది. ఈ వీడియో చూసిన పునీత్ అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు.