‘ఉల్లి సాగు’ ఉద్యోగాల కోసం.. క్యూ కట్టిన నిరుద్యోగులు !
1 min readపల్లెవెలుగు వెబ్: ఉల్లిసాగు ఉద్యోగాల కోసం కేరళ యువకులు పరుగులు పెడుతున్నారు. దక్షిణ కొరియాలో ఉల్లిసాగు ఉద్యోగాల కోసం ప్రభుత్వ సంస్థ ఓడీఈపీసీ సెమినార్ నిర్వహించింది. ఇందుకోసం గ్రాడ్యుయేట్లు, టెకీలు, ఎంబీఏ గ్రాడ్యుయేట్లు కూడ దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. ఎలాంటి అనుభం లేనివారు కూడ దరఖాస్తు చేసుకున్నారు. తిరువనంతపురంలో జరిగిన ఈ సెమినార్ కు 600 మంది నిరుద్యోగులు హాజరయ్యారు. ఓడీఈపీసీ ఎండీ అనూప్ మాట్లాడుతూ దక్షిణ కొరియా ప్రభుత్వ సహాయంతో నడిచే ఉల్లిసాగు ప్రాజెక్టు కోసం నియామక ప్రక్రియ చేపట్టినట్టు ఆయన తెలిపారు. 100 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ ప్రక్రియ చేపట్టినట్టు తెలిపారు. త్వరలో మరో 1000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ప్రస్తుతం 4000 దరఖాస్తులు వచ్చినట్టు ఆయన చెప్పారు.