PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజా సేవకే … ‘లయన్స్​ క్లబ్​’

1 min read

–లయన్స్​ క్లబ్​ 316J గవర్నర్ ఎల్​.ఎన్​. బి. రవికుమార్​
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: ప్రజలకు స్వచ్ఛందంగా సేవ చేసే ఏకైక క్లబ్​ లయన్స్​ క్లబ్​ అని పేర్కొన్నారు లయన్స్​ క్లబ్​ 316J గవర్నర్ ఎల్​.ఎన్​. బి. రవికుమార్​. ఇందుకు స్నేహభావం.. సేవా భావం కలిగి ఉండాలన్నారు. ఆదివారం 316J లయన్స్ క్లబ్ సెకండ్ డిస్టిక్ క్యాబినెట్ మీటింగ్ నగరంలోని హ్యాంగౌట్ హోటల్ లో నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా 316 J గవర్నర్ Ln బి. రవి కుమార్, PDG Ln రమేష్ నాథ్ రెడ్డి ,మొదటి వైస్ డిస్టిక్ గవర్నర్ Ln రామ చంద్ర ప్రకాష్ , రెండవ వార్డ్ వైస్ డిస్టిక్ గవర్నర్ Ln వై.నాగేశ్వరరావు యాదవ్ , కడప PDG Ln చిన్నపరెడ్డి , తాడిపత్రి PDG Ln రమేష్ నాథ్ రెడ్డి , పొద్దుటూరు మొదటి డిస్టిక్ వైస్ గవర్నర్ Ln చంద్రప్రకాష్ , పులివెందుల పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ Ln సుధాకర్ రెడ్డి , పాస్ట్ డిస్టిక్ గవర్నర్ Ln అమృత వల్లి గారు, డిస్టిక్ క్యాబినెట్ సెక్రటరీLn గౌతమ్ గారు ,PDG లు Ln నాగేశ్వర రావు , Ln డాక్టర్ బాలమద్దయ్య గారు, Ln మాణిక్య ప్రభు గా, Ln శ్రీనివాస రావు ,Ln సుధాకర్ రెడ్డి గారు, Ln బోసు, Ln శ్రీనివాస్ యాదవ్ ,RCS,ZCS,DCS, లు, కర్నూలు అనంతపురం కడప నెల్లూరు జిల్లాల లయన్స్ క్లబ్ నాయకులు,జిల్లా బీసీ నాయకులు నాగరాజు గారు, కురుమూర్తి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా లయన్స్ క్లబ్316J డిస్టిక్ 2nd వైస్ గవర్న ర్​, రాష్ట్ర గొర్రెల మరియు మేకల పెంపకం దారుల ఫెడరేషన్ చైర్మన్​ వై. నాగేశ్వరరావు యాదవ్​ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు, పేదలకు ఆహారం, వైద్యం, పేదలకు అవసరమయ్యే సహాయ సహకారాలు అందించడంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎప్పుడూ ముందుంటుందన్నారు. అనంతరం క్లబ్ ను, క్లబ్ మెంబెర్స్ ను గ్రామస్థాయి నుండి పెంచి గ్రామ స్థాయిలో కూడా సేవలు అందించేలా లయన్స్ క్లబ్ నిర్ణయం తీసుకున్నారు. ఆ తరువాత లయన్స్ క్లబ్ లో నిరంతరం సేవలు అందిస్తున్న లయన్స్ క్లబ్ పెద్దలను, నాయకులను లయన్స్ క్లబ్2nd వైస్ గవర్నర్ వై.నాగేశ్వరరావు యాదవ్ గ, సతీమణి Ln శైలజ యాదవ్ సన్మానించారు.


About Author