PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్థానిక సంస్థల ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్

1 min read

పల్లెవెలుగు వెబ్ : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నిక‌ల‌కు మ‌రోసారి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. వివిధ కార‌ణాల‌తో గ‌తంలో ఎన్నిక‌లు నిర్వహించ‌ని మున్సిపాలిటీలు, స్థానిక సంస్థల‌కు ఎన్నికలు నిర్వహించ‌నున్నారు. ఈ మేర‌కు రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఈనెల 3 నుంచి 5వ తేది వ‌ర‌కు నామినేష‌న్లు స్వీక‌రించ‌నున్నారు. పంచాయ‌తీల‌కు ఈనెల 14న, మున్సిపాలిటీల‌కు 15న‌, ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ స్థానాల‌కు 16న ఎన్నిక‌లు నిర్వహించ‌నున్నారు. ఈనెల 15న నెల్లూరు కార్పొరేష‌న్ ఎన్నిక‌లు కూడ జ‌ర‌గ‌నున్నాయి. ఈనెల 18న ఎంపీటీసీ, జడ్పీటీసీ, 17న మున్సిపాలిటీ ఎన్నిక‌ల కౌంటింగ్ జ‌ర‌గ‌నుంది.

About Author