NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సినిమాకు వెళ్లిన మంత్రి.. వెంట‌నే ర‌మ్మని సీఎం ఫోన్ !

1 min read

పల్లెవెలుగు వెబ్​: మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు వ‌రంగ‌ల్ లోని అమృత థియేట‌ర్లో సినిమా చూసేందుకు వెళ్లారు. ప్రముఖ ద‌ర్శక నిర్మాత ఆర్. నారాయ‌ణ మూర్తి స్వీయ ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం ‘రైత‌న్న’. ఈ సినిమా చూసేందుకు ఆర్. నారాయ‌ణ మూర్తితో క‌లిసి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు థియేట‌ర్ కు వెళ్లారు. ఆ స‌మ‌యంలోనే హైద‌రాబాద్ నుంచి సీఎం కేసీఆర్ నుంచి ఫోన్ వ‌చ్చింది. వెంట‌నే హైద‌రాబాద్ రావాల‌ని సీఎం ఫోన్ చేశారు. దీంతో మంత్రి ఎర్రబెల్లి హుటాహుటిన హైద‌రాబాద్ బ‌య‌లుదేరి వెళ్లారు. నారాయ‌ణ మూర్తీ త‌న‌కు ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పారు. కేసీఆర్ విధానాల వ‌ల్ల రైతులు ఎంతో బాగుప‌డుతున్నార‌ని, మోదీ తెచ్చిన న‌ల్లచ‌ట్టాల వ‌ల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని చెప్పారు.

About Author