సినిమా నటుడి పై కాంగ్రెస్ కార్యకర్తల దాడి !
1 min read
పల్లెవెలుగు వెబ్ :పెట్రో ధరల పెరుగుదలకు నిరసనగా కేరళ కాంగ్రెస్ కార్యకర్తలు సోమవారం కొచ్చిలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా రోడ్లను దిగ్బంధం చేశారు. అదే సమయంలో అటువైపుగా వచ్చిన కేరళ నటుడు జోజు జార్జ్ కారు చిక్కుకుపోయింది. దీంతో ఆయన కాంగ్రెస్ కార్యకర్తలతో వాదులాటకు దిగారు. నిరసన ముగించాలని కోరారు. దీంతో మండిపడ్డ కార్యకర్తలు ఆయన కారుపై దాడిచేశారు. అయితే, కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం మరోలా చెబుతున్నారు. జోజు తాగిన మత్తులో ఉన్నారని, మహిళా కార్యకర్తలతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. జోజు జార్జ్ పై పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. జోజు కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆయనను వైద్య పరీక్షలకు పంపారు. జోజు కారుపై దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.