ఒంటిగంట లోపే బద్వేలు ఫలితం.. మెజార్టీ పై బెట్టింగ్ !
1 min readపల్లెవెలుగు వెబ్:బద్వేలు ఉపఎన్నిక కౌంటింగ్ కు సర్వంసిద్ధం చేశారు. 281 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపును నాలుగు హాళ్లలో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తీ చేశారు. ఒక్కో టేబుల్ పై పది రౌండ్ల లెక్కింపు జరగనుంది. ప్రతి రౌండ్ ఫలితాలను డిజిటల్ తెర పై మీడియాకు తెలియజేయనున్నారు. సుమారు 5 నుంచి 6 గంటల పాటు లెక్కింపు జరగనుంది. ఈ లెక్కన మధ్యాహ్నం 1 గంట లోపు ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే.. బద్వేలు ఉపఎన్నికల ఫలితం పై జోరుగా బెట్టింగ్ కొనసాగుతోంది. లక్ష ఓట్ల మెజార్టీ సాధిస్తామని వైకాపా ధీమా వ్యక్తం చేస్తోంది. 30 వేల ఓట్లు సాధిస్తామని బీజేపీ చెబుతుండగా.. 20 వేల ఓట్లు సాధిస్తామని కాంగ్రెస్ చెబుతోంది. వైకాపా అభ్యర్థిగా డాక్టర్ సుధ, బీజేపీ అభ్యర్థిగా పనతల సురేష్, కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కమలమ్మ పోటీ చేశారు.