విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని.. ఎన్బీసీవీఎస్ ధర్నా
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. విద్యార్థి సంఘం అధ్యక్షుడు నాగరాజు, రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వై. నాగేశ్వరావు యాదవ్ మాట్లాడుతూ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలన్నారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలకు బీసీ విద్యార్థుల సంక్షేమం పట్టదా.. అని ప్రశ్నించారు. ఒక వార్డెన్ మూడు నుంచి ఐదు హాస్టళ్లకు ఇన్చార్జ్గా నియమించారని, దీంతో పిల్లలను వారు ఎలా కంట్రోల్ చేస్తూ మంచి విద్యను ఎలా అందిస్తారన్నారు. ప్రతిహాస్టల్కు రెగ్యులర్ వార్డెన్‌ను నియమించాలని, వసతి గృహాలలో సౌకర్యాలు కల్పించాలని, బీసీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థుల కోసం రూ. 5 కోట్లతో నిర్మించే భవనం పునాదులకే పరిమితమైందని, వెంటనే పున: నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు.