‘పంచ్ ప్రభాకర్’ పై ప్రత్యేక బృందం.. హైకోర్టు సీరియస్
1 min readపల్లెవెలుగు వెబ్: పంచ్ ప్రభాకర్ కేసు మరోసారి హైకోర్టులో విచారణ జరిగింది. న్యాయమూర్తుల పై అనుచిత వ్యాఖ్యల కేసులో సీబీఐ తీరుపై కోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. రిజిస్ట్రార్ జనరల్ నుంచి లేఖ వచ్చిన వెంటనే యూట్యూబ్, ఫేస్ బుక్, ట్విట్టర్.. ప్రభాకర్ పోస్టులను డిలీట్ చేశాయని, అకౌంట్ కూడ బ్లాక్ చేశాయని స్టాండింగ్ కౌన్సిల్ అశ్విని కుమార్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ అంశం పై తాము కూడ లేఖ రాసినట్టు సీబీఐ తెలిపింది. దీనిపై స్పందించిన ధర్మాసనం లేఖ రాసి ఉపయోగం ఏంటని ప్రశ్నించింది. సీబీఐ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు చెప్పింది వినకపోతే .. మీరు చెప్పింది వినాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ ఏం చేయాలో తామే ఆదేశాలిస్తామని స్పష్టం చేసింది. అవసరమైతే ప్రత్యేక బృందం ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తామని తెలిపింది.