ఉద్యానవన పంటలపై అవగాహన యాత్ర
1 min readపల్లెవెలుగువెబ్, మహానంది: కర్నూలు జిల్లా మహానంది మండలం గాజులపల్లెలో డాక్టర్ ఠాగూర్ నాయక్ నేతృత్వంలో అరటి పంట గుపై రైతులకు అవగాహన కల్పించారు. పంట లో వ్యాపిస్తున్న చీడపీడల నివారణ మరియు రసాయనిక క్రిమిసంహారక మందుల వాడకం పై వివరించారు. జీవన మరియు సేంద్రియ ఎరువులు వాడటం వల్ల రైతులు లాభాలు పొందవచ్చని, రసాయనిక ఎరువులు వాడటం వల్ల ప్రకృతి లో పలు మార్పులు సంభవించి పంటలు దెబ్బ తినే అవకాశం ఉందన్నారు.
అరటి గెలలు మాగకుండా ఉండేందుకు ఉన్న ఒక ప్రత్యేక ద్రావణాన్ని పిచికారి చేసి కొంత కాలం నిలువ చేసుకోవచ్చన్నారు. పలు జాగ్రత్తలు పాటించడం వల్ల అరటి రైతులు నష్టపోకుండా ఉండేందుకు అవకాశం అవుతుందన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల అరటి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, కాలానుగుణంగానూతన వంగడాలు, అరటి పంట వేసుకుంటే రైతులు నష్టాల నుండి బయట పడే అవకాశం ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ ఏవో శ్రీధర్ మరియు రైతులు పాల్గొన్నారు.