యూఎస్ ఫెడ్ భయం.. నష్టాల్లో స్టాక్ మార్కెట్
1 min readపల్లెవెలుగు వెబ్: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు చివరికి నష్టాలతో ముగిశాయి. త్వరలో యూఎస్ ఫెడ్ మీటింగ్ వివరాలు వెల్లడికానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. ఆటో సెక్టార్, బ్యాంకింగ్ సెక్టార్ స్టాక్స్ లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 257 పాయింట్ల నష్టంతో 59,771 వద్ద ట్రేడింగ్ ముగించింది. నిఫ్టీ 59 పాయింట్ల నష్టంతో 17829 వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 536 పాయింట్ల నష్టంతో 39,402 వద్ద క్లోజ్ అయింది.