అందు వల్లే..చిరంజీవి బాగున్నాడు : మోహన్ బాబు
1 min readపల్లెవెలుగు వెబ్: నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఆహా ఓటీటీ వేదికగా ప్రసారం అవుతున్న ప్రోగ్రాం ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీకే’. ఈ షోకు మోహన్ బాబు ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా చిరంజీవిపై మీకున్న అభిప్రాయం ఏంటి? అని మోహన్‌బాబును బాలకృష్ణ అడగ్గా .. ‘చిరంజీవి మంచి నటుడు, అద్భుతంగా డ్యాన్స్ చేస్తాడు. వ్యక్తిగతంగా అతనిపై ఎలాంటి చెడు అభిప్రాయం లేదు. అల్లు రామలింగయ్యగారి కుమార్తె సురేఖను పెళ్లి చేసుకున్నాడు. ఆయనతో కలిసి ఎన్నో సినిమాలు చేశా. సురేఖ నాకు సోదరిలాంటిది. అంటే మన ఇంటి అమ్మాయిని చిరంజీవి పెళ్లి చేసుకున్నాడు. కాబట్టే అతను బాగున్నాడు’ అని సమాధానం ఇచ్చారు.
మద్యం అలవాటు పై ..
మద్యం సేవించే అలవాటుపై మోహన్‌బాబు మాట్లాడుతూ.. ‘మద్రాసులో ఉన్న రోజుల్లో కోడంబాకం బ్రిడ్జ్ కింద సారా దుకాణాలు ఉండేవి. ఒక స్నేహితుడితో కలిసి వెళ్లి అక్కడ సారా తాగేవాడిని. ఆ విధంగా జీవితం ప్రారంభమై, లేని రోజుల్లోనూ తాగాను. ఇప్పుడు భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి మంచి విస్కీ తాగుతున్నా’ అని అన్నారు.