అనంతలో ఫ్యాక్షన్ పాలిటిక్స్…పంట దగ్ధం
1 min read
పల్లెవెలుగు వెబ్, అనంతపురం: జిల్లాలోని కళ్యాణదుర్గం నియోజకవర్గం,శెట్టూరు మండలం,చిన్నంపల్లి గ్రామంలో
ఐదు ఎకరాల్లో ఆరుగాలం కష్టపడి పండించిన వేరుశనగ పంటకు నిప్పు పెట్టిన దుండగులు. తనకున్న ఐదు ఎకరాల్లో కష్టపడి పండించిన వేరుశనగ పంటకు రాజకీయ దురుద్ధేశంతో దుండగులు ఈరోజు తెల్లవారుజామున రెండు గంటల సమయంలో నిప్పు పెట్టారని తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు రైతు వడ్డే రామన్న S/o సన్న గంగప్ప తెలిపాడు. ఈ ఘటనలో దాదాపు రైతుకు లక్షా అరవై వేల రూపాయలు దాకా పెట్టుబడికి ఖర్చులు చేసినట్లు తెలిపారు. దాదాపు రెండు లక్షల ఎనబై వేల రూపాయలు నష్టపోయినట్లు బాధిత రైతు తెలిపాడు.