PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘ఎన్నిక’ ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలి..

1 min read
మాట్లాడుతున్న కలెక్టర్​ జి. వీరపాండియన్​

మాట్లాడుతున్న కలెక్టర్​ జి. వీరపాండియన్​

నేడు..మేయర్​, డిప్యూటీ మేయర్​, చైర్మన్​, వైస్​ చైర్మన్​ ప్రమాణస్వీకారం

– జూమ్​ వీసీలో అధికారులను ఆదేశించిన కలెక్టర్​ జి. వీరపాండియన్​
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: కర్నూలు నగర పాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్, నందికొట్కూరు, ఆత్మకూరు, ఆళ్లగడ్డ మున్సిపాలిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్ లు, గూడూరు నగర పంచాయతీ చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నిక సంబంధించి ఏర్పాట్లను ప్లాన్ ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ జి వీరపాండియన్ మున్సిపల్ కమిషనర్లకు ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్ నగర పాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్, 7 మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్, నగర పంచాయతీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఏర్పాట్ల పై మున్సిపల్ కమిషనర్లు, ఆర్ డి ఓ లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ ఆఫీసర్లతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూమ్ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు అభివృద్ధి) రామ సుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) సయ్యద్ ఖాజా మోహిద్దీన్, కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ డి.కె.బాలాజీ, నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి, డిఆర్ఓ పుల్లయ్య, ఆర్ డి ఓ లు, మున్సిపల్ కమిషనర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బుధవారం చైర్మన్లు, మేయర్లు, వైస్‌ చైర్మన్లు..డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరుగుతుందన్నారు. కార్పొరేటర్లు, ఎక్స్‌ అఫీషియో సభ్యుల సీటింగ్‌ నుంచి మొదలు ఎన్నికల నిర్వహణకు అనుసరించాల్సిన విధానాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ప్రమాణ స్వీకారం తొలి సమావేశం జరగనుండగా అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. అంతకుమునుపు నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్, 7 మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్, నగర పంచాయతీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక పై ట్రైనింగ్ మేనేజ్మెంట్ నోడల్ అధికారి జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సోమశేఖర్ రెడ్డి శిక్షణ ఇచ్చారు.

About Author