ఉద్యోగులపై ఆరోపణలు చేస్తున్న… మురళీధర్ రెడ్డిపై చర్యలు తీసుకుంటాం..
1 min read– కల్లూరు తహసీల్దార్ రమేష్ బాబు
పల్లెవెలుగు వెబ్, కల్లూరు: ప్రభుత్వ ఆదేశానుసారం ఇరిగేషన్ భూములకు సంబంధించి పట్టాలు మంజూరు చేశామని, కానీ మురళీధర్ రెడ్డి అనే వ్యక్తి అధికారులపై నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదన్నారు కల్లూరు తహసీల్దార్ రమేష్‌బాబు. శుక్రవారం కల్లూరు తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తహసీల్దార్‌తోపాటు డిప్యూటీ తహసీల్దార్ గిరి కుమార్ రెడ్డి , మృదుల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కల్లూరు తహసీల్దార్ రమేష్ బాబు మాట్లాడుతూ కర్నూలు నగరంలోని గణేష్ నగర్‌కు చెందిన మురళీధర్ రెడ్డిఅనే వ్యక్తి అధికారులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇరిగేషన్, ఎండో మెంట్ భూములను ప్రభుత్వ నియమనిబంధనలు అనుసరించి పేదలకు పట్టాలు మంజూరు చేశామని, అలాగే మృదుల అనే మహిళకు అప్పటి జిల్లా స్క్రుట్నీ చేసి ఎస్.సి.ధ్రువపత్రం ఇచ్చామన్నారు. మురళీ ధర్ రెడ్డి అనే వ్యక్తిపై జిల్లాలో వివిధ కేసులు నమోదయ్యాయని, అటువంటి వ్యక్తి ఉద్యోగులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ… విధులకు ఆటంకం కలిగిస్తున్నాడని, అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అనంతరం మృదుల మాట్లాడుతూ మురళిధర్ రెడ్డి అనే వ్యక్తి తనకు రూ.65 వేలు అప్పు ఉన్నాడని, అయినా తన కుటుంబాన్ని వేధించినట్లు ఆరోపించారు. సమావేశంలో RI లక్ష్మి నారాయణ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.