వైఎస్ వివేకా హత్యలో ఉమాశంకర్ రెడ్డి పాత్ర !
1 min readపల్లెవెలుగు వెబ్ : మాజీ మంత్రి, ఏపీ ముఖ్యమంత్రి జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక మలుపు తిరుగుతోంది. కేసులో నిందితుడు గజ్జల ఉమాశంకర్ రెడ్డి పాత్రపై ఆధారాలున్నాయని కోర్టులో సీబీఐ పేర్కొంది. హత్య జరిగిన రోజున తెల్లవారుఝామున 3.15 నిమిషాల సమయంలో ఉమాశంకర్ రెడ్డి పరుగులు తీస్తున్నట్టు వివేకా ఇంటి సమీపంలో అమర్చిన సీసీ కెమెరాలో రికార్డయిందని సీబీఐ పేర్కొంది. జైల్లో ఉన్న ఉమాశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ శనివారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా దాఖలు చేసిన పిటిషన్ లో సీబీఐ సంచలన విషయాలు పేర్కొంది. హత్య కేసులో ఎర్రగంగిరెడ్డి, యాదాటి సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్ రెడ్డి, షేక్ దస్తగిరిల పాత్ర ఉందని సీబీఐ పులివెందుల కోర్టులో ప్రాథమిక అభియోగ పత్రం దాఖలు చేసింది. ఇవన్నీ పరిశీలనలోకి తీసుకున్న కోర్టు ఉమాశంకర్ రెడ్డికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.