బాహుబలి వెబ్ సిరీస్..రీ షూట్..?
1 min readతెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిన చిత్రం.. ‘బాహుబలి’. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలై.. ఇన్నేళ్లయినా క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఈ స్ఫూర్తితోనే మన దక్షిణాది వారు పాన్ ఇండియా సినిమాలతో తమ మార్క్‌ను క్రియేట్ చేస్తున్నారు. సినిమాలో బలమైన పాత్రలను బేస్ చేసుకుని రాజమౌళి ‘బాహుబలి ది బిఫోర్ ద బిగినింగ్’ అనే వెబ్ సిరీస్‌ను చేయాలనుకున్నారు. కానీ ఆయన ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేయాలనుకోలేదు. ప్రముఖ డిజిటల్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ వెబ్‌సిరీస్‌ను నిర్మించడానికి ముందుకు రాగానే, వారిని ఒప్పించి సిరీస్ దర్శకత్వ బాధ్యతలను దేవా కట్టా, ప్రవీణ్ సత్తారుకు అప్పగించారని వార్తలు వినిపించాయి. దాదాపు వందకోట్ల రూపాయలను ఖర్చుపెట్టి నెట్‌ఫ్లిక్స్ తొమ్మిది ఎపిసోడ్స్ నిర్మించింది. అయితే ఫైనల్ ఔట్పుట్ మాత్రం నెట్‌ఫ్లిక్స్‌కు నచ్చలేదు. దీంతో వారు మొత్తం ప్రాజెక్ట్‌ను మళ్లీ ఇతర దర్శకులతో రీ షూట్ చేయాలనుకుంటున్నట్లు నెట్టింట వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మరి దీని గురించి అసలు విషయాలను వివరించేదెవరో మరి..!