PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నేను కొట్టిన చెంప దెబ్బ మాత్రమే క‌న‌ప‌డిందా ?

1 min read

పల్లెవెలుగు వెబ్: జై భీమ్ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుద‌లయి ప‌లువురి ప్రశంస‌లు అందుకుంటోంది. అయితే ఈ చిత్రంలో ఓ హిందీ మాట్లాడే వ్యక్తిని ప్రకాశ్ రాజ్ చెంప దెబ్బ కొట్టడం పై పలువురు సోష‌ల్ మీడియా వేదిక‌గా అభ్యంత‌రం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశ్ రాజ్ ఓ విచార‌ణాధికారి పాత్రలో విచార‌ణ సంద‌ర్భంగా త‌మిళం తెలిసిన ఓ హిందీ వ్యాపార‌స్థుడిని విచారిస్తారు. నేరం నుంచి త‌ప్పించుకునే ఎత్తుగ‌డ‌లో భాగంగా ఆ వ్యాపారి హిందీలో మాట్లాడే ప్రయ‌త్నం చేస్తారు. కానీ ప్రకాశ్ రాజ్ చెంప‌దెబ్బ కొట్టి త‌మిళం మాట్లాడాలంటూ చెబుతాడు. ఈ సీన్ ప్రస్తుతం వివాదానికి కార‌ణ‌మైంది. దీనిపై ప్రకాశ్ రాజ్ స్పందిస్తు ఈ సినిమాలో అన్యాయానికి గురికాబ‌డ్డ ప్రజ‌ల జీవితం, వారి బాధ‌లు చూపే ప్రయ‌త్నం చేశామ‌ని చెప్పారు. ఇవేమీ చూడ‌ని కొంద‌రు చెంప‌దెబ్బ కొట్టడాన్నే టార్గెట్ చేసుకుని మాట్లాడుతున్నార‌ని అన్నారు. ఓ విచార‌ణాధికారి పాత్రలో ఎవ‌రు ఉన్నా అలానే స్పందిస్తార‌ని చెప్పారు.

About Author