‘ఎయిర్టెల్’ బ్యాంక్ సేవలు హర్షణీయం: డ్వామా పీడీ అమర్ నాథ్ రెడ్డి
1 min read– ఉపాధి కూలి కుటుంబానికి లక్ష చెక్కు అందజేత
పల్లెవెలుగు వెబ్, కర్నూలు:కర్నూలు జిల్లా నందవరం మండలం ఇబ్రహీంపురం గ్రామంలో ఉపాధి కూలి బోయ తిమ్మప్ప ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. బాధిత కుటుంబ సభ్యులకు డ్వామా పిడి అమర్నాథ్ రెడ్డి సోమవారం తన చాంబరులో ఎన్. ఆర్.జి.ఎస్. కమిటీ మెంబర్ ఎం. పుల్లారెడ్డి, ఎం అండ్ డి సిద్ధలింగమూర్తి, డిబిటి మేనేజర్ వేణుగోపాల్ ఎయిర్టెల్ జిల్లా టీఎల్ వీరారెడ్డి తో కలిసి లక్ష రూపాయలు చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా పిడి మాట్లాడుతూ ఉపాధి కూలీలకు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అందించే సేవలు హర్షణీయం అన్నారు. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ టర్మ్ పాలసీ కలిగి ఉండటం ప్రతి ఉపాధి కూలి కుటుంబ సభ్యులకు ఆసరా అన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో రూ.250 చెల్లించి ఎయిర్టెల్ టర్మ్ పాలసీ కట్టారు. దీంతో కుటుంబానికి లక్ష రూపాయల బీమా సొమ్మును ఎయిర్టెల్ సంస్థ నామిని అకౌంట్ లో జమ చేసిందని కర్నూలు జిల్లా ఆ సంస్థ కోర్దినేటర్ వీరారెడ్డి వెల్లడించారు. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరు రూ. 250 చెల్లించి టర్మ్ పాలసీ పొందాలని కోరారు. ఈ పాలసీ లో భాగస్వామ్యం అయిన వినియోగదారులు సహజ మరణం పొందిన వారికి రూ.లక్ష, ప్రమాదంలో మృతి చెందిన వారికి రూ.2 లక్షలు భీమా వర్తిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎయిర్టెల్ ప్రమోర్టర్లు యూ హానుమేష్, రామచంద్ర, సీఎస్పీ వీరేశ్ లు పాల్గొన్నారు.