శ్రీ గిరి పై భక్తుల రద్దీ
1 min readపల్లెవెలుగు వెబ్, శ్రీశైలం: కార్తీకమాసం మొదటి సోమవారం కావడంతో భక్తులు రద్దీ దృష్టిలో ఉంచుకొని వేకువజామునే ఆలయ అధికారులు భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీశైలం మహా క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. పరమ శివుని ప్రీతికరమైన మొదటి సోమవారం కావటంతో ఉభయ తెలుగు రాష్ట్రాల నుండే కాక కర్ణాటక నుండి అధిక సంఖ్యలో క్షేత్రానికి భక్తులు చేరుకున్నారు. భక్తులకు అలంకార దర్శనాలు కల్పించరు భక్తులకు ఎటువంటి ఇబ్బందులకు కలుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈవో లవన్న అధికారులను ఆదేశించారు.
క్యూకాంప్లెక్స్ వేచివుండే భక్తులకు నిరంతరం అల్పాహారం, బిస్కెట్లు, మంచినీరు మరియు వేడిపాలు అందజేశారు. తెల్లవారుజుమున కృష్ణా నదిలో పుణ్య స్నానాలు చేసి కృష్ణమ్మకు పసుపు కుంకుమ సారెలు సమర్పించి కార్తీక దీప దానాలు చేశారు. ఆలయ పరిసరాల్లోని గంగాధర మండపం మరియు ఉత్తరమాడ వీధి వద్ద భక్తులు కార్తిక దీపారాధన చేశారు స్నానాల ఘాట్ వద్ద ప్రమాదాలు జరుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మరి కొంత మంది రాజకీయ నాయకులు మల్లన్న దర్శించుకున్నారు శ్రీశైలం క్షేత్రం శివనామస్మరణతో మారుమోగుతోంది.