అంతరిక్షంలో ఆధిపత్యం !
1 min readపల్లెవెలుగు వెబ్ : భూమి మీద జరిగే వ్యాపారాల్లోనే కాదు, అంతరిక్షంలో జరిపే ప్రయోగాల్లోనూ నువ్వా నేనా అంటూ ఒకరికొకరు పోటీపడుతున్నారు. అంతరిక్షంలో ఆధిపత్య కోసం ప్రయత్నిస్తున్నారు. వారే స్పేఎస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్. ఇప్పటికే ఆర్టెమిస్ ప్రాజెక్టులో భాగంగా లూనార్ ల్యాండర్ ప్రాజెక్ట్‌ను ఛేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు చేసి అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ విఫలమయ్యారు. తాజాగా స్పేస్‌లో ఆదిపత్యం చెలాయించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. శాటిలైట్ ఇంటర్నెట్ విషయంలో మస్క్ అందరికంటే ముందంజలో ఉండగా.. జెఫ్‌బెజోస్ సైతం ‘ప్రాజెక్ట్ కైపర్’ పేరుతో శాటిలైట్ ఇంటర్నెట్ను అందించనున్నారు. ఇందుకోసం ఉపగ్రాహాలను స్పేస్‌లోకి పంపేందుకు అమెరికా ప్రభుత్వం నుంచి వరుసగా అనుమతులు తీసుకుంటున్నారు.