PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పల్లెవెలుగు వెబ్​, శ్రీశైలం: కార్తిక మొదటి సోమవారం సందర్భంగా పుష్కరిణి వద్ద దేవస్థానం. లక్షదీపోత్సం మరియు పుష్కరిణిహారతిని నిర్వహిస్తోంది. లోకకల్యాణం కోసం ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. కార్తికమాసంలో ప్రతి సోమవారం (మొత్తం నాలుగు సోమవారాలు) మరియు కార్తీక పౌర్ణమి రోజున కూడా ఈ కార్యక్రమాలు జరిపించబడుతాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ లక్షదీపోత్సవం, పుష్కరిణిహారతి కార్యక్రమాలు జరిపించబడుతున్నాయి. ఈ దీపోత్సవ కార్యక్రమంలో పుష్కరిణి ప్రాంగణమంతా కూడా దీపాలను ఏర్పాటు చేయడంజరిగింది. ఈ దీపోత్సవ కార్యక్రమంలో పుష్కరిణి ప్రాంగణమంతా కూడా దీపాలను ఏర్పాటు చేయడం కార్తీకమాసంలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యముంది. ఈ మాసంలో దీపారాధననే కాకుండా దీపదర్శనం కూడా ఎంతో పుణ్యదాయకమని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక దీపదర్శన వలన జాతిభేదం లేకుండా మానవులందరికీ ఇంకా పక్షులు, కీటకాలు, జలచరాలు మొదలైన వాటికి, ఇంకా వృక్షాలకు కూడా పునర్జన్మ ఉండదని పురాణాలు చెబుతారు.
పుష్కరిణి హారతి :


ముందుగా శ్రీస్వామి అమ్మవార్లకు మరియు పుష్కరిణికి దశవిధ హారతులు శాస్త్రోక్తంగా ఇవ్వబడుతాయి. కాగా ఈ కార్యక్రమానికి ముందుగా శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పుష్కరిణి వద్దకు వేంచేబు చేయించి విశేషంగా పూజాదికాలు జరిపించబడుతాయి. అనంతరం శ్రీస్వామి అమ్మవార్లకు, పుష్కరిణి దశవిధ హారతులను ఇవ్వడం జరుగుతుంది.

About Author