చెన్నైలో భారీ వర్షానికి కారణం ఇదే !
1 min readపల్లెవెలుగు వెబ్ :చెన్నైలో భారీ వర్షం కురిసింది. 2015 తర్వాత ఇలాంటి వర్షం ఎప్పుడూ కురవలేదు. దీంతో పాటు చెన్నై వర్షపాతానికి సంబంధించి వాతావరణ శాఖ ఎలాంటి సూచన చేయలేదు. వాతావరణ పరిస్థితి, గాలి దిశను బట్టి ఈనెల 6 వ తేదిన చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాల్లో వర్షసూచన చేసినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపరాఉ. చెన్నైకు భారీ వర్ష సూచన చేయలేదన్నారు. 6వ తేదిన తక్కువ సమయంలో అధిక వర్షం నమోదయిందన్నారు. దీనిని మెసస్కేల్ ఫిలామినా అంటారని తెలిపారు. దీనిని ముందుగా గుర్తించే అవకాశం లేదని వాతావరణ శాఖ సౌత్ జోన్ చీఫ్ బాలచంద్రన్ తెలిపారు.