చైనాను అధిగమించిన భారత్ !
1 min readపల్లెవెలుగు వెబ్: దేశ ప్రజలందరికీ ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం విషయంలో చైనాను భారత్ అధిగమించిందని ఓ నివేదిక పేర్కొంది. పెద్ద నోట్ల రద్దు ఐదవ వార్షికోత్సవం సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ ఓ నివేదిక రాశారు. ఆ నివేదిక ప్రకారం భారత్‌లో మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లావాదేవీల సంఖ్య 2015లో వెయ్యి మందికి 183. కాగా 2020లో ఈ సంఖ్య 13,615కు చేరింది. ఇక బ్యాంక్ శాఖల సంఖ్య లక్ష మంది పెద్దలకు 13.6 ఉంటే, ఇది 2020 నాటికి 14.7కు ఎగసింది. ఈ గణాంకాలు జర్మనీ, చైనా, దక్షిణాఫ్రికా కంటే ఎక్కువ. ఆర్థిక వ్యవస్థలో అందరికీ భాగస్వామ్యం, బ్యాంకు ఖాతాల విషయంలో ముందున్న రాష్ట్రాల్లో మద్యం, పొగాకు వినియోగం గణనీయంగా తగ్గాయి. నేరాలూ తగ్గుముఖం పట్టాయి. ఆర్థికాభివృద్ధి విషయంలో ఆయా రాష్ట్రాలు మిగిలిన రాష్ట్రాలకంటే ముందుండడం గమనార్హం.